రష్మిక 'మైసా' నుంచి అప్డేట్.. సాంగ్ షూటింగ్ పూర్తి!
- గిరిజన యువతిగా రష్మిక ప్రధాన పాత్రలో 'మైసా'
- సినిమాలోని కీలకమైన పాట చిత్రీకరణ పూర్తి
- భారీ యాక్షన్ కోసం బ్యాంకాక్‌లో కఠిన శిక్షణ తీసుకున్న రష్మిక
- గిరిజన యువతి పాత్రలో నటిస్తున్న శ్రీవల్లి
- భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్ అవుతుందంటున్న చిత్ర యూనిట్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాట చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే వెల్లడించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సెట్స్‌కు సంబంధించిన ఫోటోను పంచుకుంటూ, "#Mysaa సాంగ్ ప్యాకప్" అని ఆయన పోస్ట్ చేశారు. రష్మికపై చిత్రీకరించిన ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కేరళలో ఈ సినిమాకు సంబంధించి ఒక సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్లో స్టంట్ మాస్టర్ కెచా కంపాక్డీ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో రష్మిక స్వయంగా కొన్ని హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించినట్లు సమాచారం.
ఈ యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా నటించేందుకు రష్మిక థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అక్కడ రోజూ 8 గంటల పాటు శ్రమించి, అంతర్జాతీయ నిపుణుల వద్ద అధునాతన స్టంట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్ వంటివి నేర్చుకున్నారు. ఈ చిత్రంలో రష్మిక ఒక గిరిజన (గోండు) యువతి పాత్రలో కనిపించనున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమ అవసరమైన ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.
అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. రష్మికతో పాటు ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.